EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ విలీనం జరిగినప్పుడు బీజేపీ పుట్టనే లేదు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్ సెప్టెంబర్ 17 (ఈతరం భారతం)వల్లభాయ్ పటేల్ నీ బీజేపీ తన నాయకునిగా చెప్పుకుంటున్నారు తెలంగాణ విలీనం గురించి మాట్లాడే హక్కు బీజేపీ కి లేదని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలలలో జాతీయ జండాను ఆవిష్కరించారు.అనంతరం మహేష్ గౌడ్మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లనే స్వతంత్రం వచ్చింది.. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యిందన్నారు. సెప్టెంబర్ 17.. 1948 వరకు మన సంస్థానం కి స్వతంత్రం రాలేదు . దూర దృష్టి ఉన్న నెహ్రూ.. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నీ పంపి దేశంలో విలీనం చేయించారు బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుందితెలంగాణ విలీనం జరిగినప్పుడు బీజేపీ పుట్టనే లేదుస్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదుఅనాడు ఉన్న ఇప్పటి బీజేపీ అనుబంధ సంఘాలు బ్రిటిష్ కి వంతపాడారని విమర్శించారు.వల్లభాయ్ పటేల్ కి బీజేపీ కి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు…పదేళ్లు తెలంగాణ నీ తుంగలో తొక్కిన కేసీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారుఐటి రంగాన్ని దేశంకి పరిచయం చేసింది రాజీవ్ గాంధీచదువుకున్న అనుకుంటున్న కేటీఆర్ కి సంస్కారం లేదుసంస్కారం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా?తెలంగాణ తల్లిని గౌరవించాలని.. సెక్రటేరియట్ గుండెల్లో విగ్రహం పెడుతుంది ఈ కార్యక్రమం లో ప్రభుత్వం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి సేవాదల్ చీఫ్ జితేందర్, ఫిషెరీస్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు

 

Related News

Select the Topic
Scroll to Top