EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలుగు దేశం పార్టీ ఆఫీస్ కు వెళ్లి తెలుగు తమ్ముళ్లను కలిసిన మంత్రి పొంగులేటి…

01.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి మధుశ్రీ నలుబోల,  ఖమ్మం.

ఈ లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘు రాం రెడ్డి కి మద్దతు ఇచ్చి..అందరి సహకారం తో భారీ విజయాన్ని అందిద్దాం అని కోరారు. అభ్యర్థి రఘు రాం రెడ్డితో కలిసి బుధవారం నగరంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి బాధ్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతోనేని హరీష్, ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. తెలుగు తమ్ముళ్లు నేరుగా వచ్చి కలవొచ్చని భరోసా ఇచ్చారు. రఘురాం రెడ్డి కి అంతా మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, విద్యా, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు ఎండీ. ముస్తఫా, కొప్పుల చంద్ర శేఖర్ రావు, బాణోత్ ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top