EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలుగు సంవత్సరాది ఉగాది నీ పురస్కరించుకొని నూతన పంచాంగ ఆవిష్కరణ .

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి  : నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని వంగపల్లి కైలాసపురం కాచారం గ్రామ శ్రీ గౌరీ రేణుక వాసవి బసవలింగేశ్వర స్వామి దేవాలయం పూజారి డాక్టర్ వంగపల్లి అంజయ్య గురుస్వామి నూతన పంచాంగాన్ని పిసిసి ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర యాదాద్రి జిల్లా ప్రజల కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తుల తూగాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్ట మల్లారెడ్డి, యాదాద్రి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాల్వేర్ ఉపేందర్, ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు నా కోటి రాము తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top