EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

బద్రాచలం ఫిబ్రవరి 18 (ఈ బీ న్యూస్);కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు ఏ విధంగా తోడ్పడ్డాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను సైతం అమలు చేయడానికి రేవంత్ సర్కార్ సాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు కీలక హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా సంచలన ప్రకటన చేసింది. భద్రాద్రి శ్రీరాముడి సన్నిధిలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తెలంగాణ మహిళలకు సంబంధించినదే కావడం విషెశం.త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని భట్టి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిలాగా చూసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్న మరోసారి ఆయన గుర్తు చేశారు. జీతాలు సకాలంలో అందని ఆశా వర్కర్లు. అంగన్‌వాడీ సిబ్బంది జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలతో ఇందిరమ్మ రాజ్యం పాలన సాగుతోందన్నారు. కాగా.. మహిళలకు ఇది నిజంగానే అదిరిపోయే శుభవార్తే అని చెప్పుకోవచ్చు. భద్రాద్రి రాముని సన్నిధిలో భట్టీ చేసిన ఈ కీలక ప్రకటనతో తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళా సంఘాల నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top