EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దివ్యాంగులకు చేయూతనిస్తున్న ఖమ్మం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు అభినందనీయం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

3.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత(ఈ బీ న్యూస్)దివ్యాంగులకు చేయూతనిస్తున్న ఖమ్మం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం స్థానిక కృషి భవన్ రోడ్లోని డిఎన్ఎఫ్ సంస్థ కార్యాలయం, గణేష్ బోనాల నిలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, 25 మంది దివ్యాంగులకు 3 లక్షల రూపాయలు విలువ చేసే వీల్ చైర్స్, ఎస్బిఐటి లో బీటెక్ చదువుతున్న ఒక పేద విద్యార్థినికి 50 వేల రూపాయలు విలువచేసే లాప్ టాప్ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు, విద్యార్థులకు, మహిళలకు ఎన్నారై ఫౌండేషన్ వారు వివిధ రకాల సేవలతో వారి జీవితాల్లో వెలుగులు నింపటం అభినందనీయమని అన్నారు. దివ్యాంగులకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం వల్ల దివ్యాంగుల జీవితాలకు లబ్ధి చేకూరుతుందని, ఫౌండేషన్ వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ప్రస్తావించారు.

ఎన్నారై ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుంచి జిల్లా వాసులైన అనేకమంది ఎన్నారైలు తమ వంతు సాయం అందించడం వల్ల సేవా కార్యక్రమాలు చేశామని, ఈ విధంగా మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం తమకు కలిగిందని ఎన్నారై ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బయ్యన బాబురావు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఎన్నో సేవా కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం దొరికిందని, ఇంకా సుమారుగా వందమంది దివ్యాంగులకు వీల్ చైర్లు అందించడానికి సిద్ధం చేశామని ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బోనాల రామకృష్ణ బండి నాగేశ్వరరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో 54 డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, ఫౌండేషన్ బాధ్యులు మిక్కిలినేని నరేంద్ర చౌదరి, కోశాధికారి పసుమర్తి రంగారావు, కొంగర పురుషోత్తమరావు, కురివెళ్ల ప్రవీణ్, అన్నం శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, కళ్యాణపు సాంబశివరావు, అంబేత్కర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, పద్మిని, వాసిరెడ్డి అర్జునరావు, ముదాలగర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top