యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22 (ఈతరం ఇండియా న్యూస్ ) : ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గామాత వివిధ అలంకారాలలో దర్శనం ఇవ్వగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. సాయిబాబా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఐడియా శ్రీనివాస్, ప్రభావతి దంపతులు, వర్కింగ్ చైర్మన్ కామిటికారి అశోక్, ట్రస్ట్ మెంబర్ చలంతో పాటు ప్రధాన అర్చకులు ప్రీతం దూబే, భక్తులు పాల్గొన్నారు.















