3.4.2024. ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఖమ్మం.
దేశం సమగ్రాభివృద్ధి చెందాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. బుధవారం మధిర పట్టణ పరిధిలోని రెడ్డి గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని మరింత పురోభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి దేశానికి మళ్ళీ మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. కార్యకర్త లే తనకు బలం , బలగమని గెలిచే 400 జాబితాల ఖమ్మం ను చేర్చే గురుతర బాధ్యత స్వీకరించాలని కార్యకర్తల కు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ వినోద్ రావు గారి లాంటి స్వచ్ఛమైన ,సమాజ సేవకుడి ని లోక్ సభ కు పంపితే నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధిచెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి నాగేశ్వరరావు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు సిలివేరు సాంబశివరావు, జనసేన పార్టీ మధిర నియోజకవర్గం కన్వీనర్ డేవిడ్, మండల అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.















