EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దొడ్డి కొమురయ్య పోరాటాలను కొనసాగిస్తాం…  ప్రముఖ హైకోర్టు న్యాయవాధి నర్రి స్వామి , ఐపీసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీధర్

హైదరాబాద్ ఏప్రిల్ 3 (ఈతరం భారతం న్యూ స్);హైదరాబాద్ లోని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య గారి 97వ జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ నర్రి స్వామి కురుమ మాట్లాడుతూ శ్రీ దొడ్డి కొమురయ్య మహనీయుడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనియునికి ఏపీ సి పార్టీ కార్యాలయంలో దొడ్డు కొమురయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించడం చాలా సంతోషకరం భవిష్యత్తులో పోరాటాలను కొనసాగిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీధర్ గారు మాట్లాడుతూ దొడ్డు కొమురయ్య గారు ఎంతోమంది యువతకు స్ఫూర్తి ప్రదాత దోడ్డి కొమరయ్య గారి స్ఫూర్తిగా తీసుకొని అన్ని పార్టీలను ఎదుర్కొంటూ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐపిసి నాయకులు నజీర్ భాష నేషనల్ జనరల్ సెక్రెటరీ, వాసుదేవరావు తెలంగాణ జనరల్ సెక్రెటరీ, భాస్కర్ నామాని, అంజలీదేవి, గోగిరెడ్డి,కొండలరావు, నరసింహ గుప్తా అనేక మంది పాల్గొన్నారు

 

Related News

Select the Topic
Scroll to Top