EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ధరణి లోటు పాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

 

హైదరాబాద్ డిసెంబర్:(ఈతరం ఇండియా న్యూస్ );: సచివాలయంలో ధరణి పోర్టల్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణి లోటు పాట్లపై వారం పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని సూచించారు. ధరణి యాప్ భద్రతపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలపై డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం కోరారు. నెలకోసారి మండల రెవెన్యూ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహించాలని, ఎన్నికల్లో ధరణి వ్యవస్థ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై సీఎం చర్చించారు

 

 

Related News

Select the Topic
Scroll to Top