హైదరాబాద్ ఫిబ్రవరి 1 (ఈ బీ న్యూ స్); ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కళాకారులకి ఇచ్చేటటువంటి పురస్కారం నంది అవార్డు పేరును మార్చి గద్దర్ అన్న అవార్డుగా నామకరణం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రివర్గ బృందం మొత్తం తెలంగాణ సమాజం ముందు వారి జయంతి రోజున జాతికి అంకితం చేయటం అనేది చాలా సంతోషదాయకం హర్షనీయమని సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పోకల కిరణ్ కుమార్ అన్నారు.హైదరాబాదులోని బర్కత్ పుర రాష్ట్ర కార్యాలయం సామాజిక భవన్లో వివిధ ప్రజా సంఘాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్దర్ అన్న జయంతి సందర్భంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సాధన లో గద్దర్ అన్న చేసినటువంటి త్యాగానికి నిదర్శనమన్నారు. అనేక వర్గాల ప్రజలను వివక్షతకు అణిచివేతకు అవమానాలకు ఎలివేయబడినటువంటి వర్గాలను తన మాటల ద్వారా పాటల ద్వారా ఆటల ద్వారా ప్రపంచానికి ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజా యుద్ధ నౌక కద్దర్ అన్నతో పాటు పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ సదా లక్ష్మమ్మ జయంతి కూడా ప్రభుత్వ అధికారికంగా జరిపి విగ్రహాన్ని ట్యాంక్బండ్ పై నెలకొల్పాలని వక్తలు తెలియజేస్తూ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఆలోచన విషయంలో ఎంతో గొప్ప ప్రజా పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలతో పాటు ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి మరియు అనుబంధ సంఘాలు అదేవిధంగా టిఎంఆర్పిఎస్, బిఎల్ఎఫ్, బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాలు ప్రతినిధులు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు మరియు సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గోసంగి శ్రీనివాస్ మాదిగ,నక్క పరమేష్ యాదవ్ తదితర నాయకులు పాల్గొని హర్షం వ్యక్తం చేసారు.















