హైదరాబాద్ జనవరి 29 (ఈ బీ న్యూ స్):మాజీ పీసీసీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి, ఆయన అనుభవాలు మాకు మార్గదర్శకంగా ఉండేవని సిఎం గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు
.















