EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నాగార్జునపైనా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు

హైదరాబాద్ డిసెంబర్ 20 (ఈతరం న్యూ స్);బిగ్ బాస్ షోకు సంబంధించి రోజు రోజుకు వివాదం ముదురుతుంది. ఈ షో సీజ‌న్ 7 ముగిసిన అనంత‌రం జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌నపై జూబ్లీహిల్స్ పోలీసులు రెండు కేసులు న‌మోదు చేసి విచారణ జరుపుతున్నారు.ఇదిలావుంటే.. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో ఎదుట జ‌రిగిన దాడిని న్యాయవాది తన ఫిర్యాదులో ప్రస్తావిస్తూ.. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని.. బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వ‌ల్లే ఈ దాడి జ‌రిగింద‌ని పేర్కొన్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు రెండు కేసులు న‌మోదు చేశార‌ని.. ఇందులో నాగార్జున పేరు ఎక్క‌డ‌ లేద‌ని.. నాగార్జునను కూడా బాధ్యుడ్ని చేయాలని న్యాయవాది అరుణ్ విజ్ఞప్తి చేశారు. ఈ దాడి వ‌ల‌న 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయ‌ని.. నాగార్జునపైనా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.మ‌రోవైపు.. ఈ దాడి ఘ‌ట‌న‌లో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు విచారణ జరిపిన అనంతరం ఈ దాడులకు ముఖ్య కార‌ణం పల్లవి ప్రశాంత్ అని తేల్చారు. దీంతో ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా(ఎ-1) కేసు నమోదు చేశారు. అలాగే అతని సోదరుడు, స్నేహితుడిని సైతం నిందితులుగా(ఎ-2, ఎ-3) నమోదు చేసి మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే వీరికి సంబంధించిన రెండు కార్లను సీజ్‌ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్ల‌డించారు.

Related News

Select the Topic
Scroll to Top