3.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మదుశ్రీ, ఖమ్మం(బోనకల్)
“కసి తో పని చేసి నామను గెలిపించాలి. నామ ను గెలిపించి కేసీఆర్ కు అండగా నిలుద్దాం. ప్రజలు గోస పడుతున్నారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారు ” అన్నారు బీ ఆర్ ఎస్ కార్యకర్తలు.బోనకల్ మండలం జానకీపురంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో , తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర, లింగాల కమలరాజ్, కొండబాల కోటేశ్వరరావు లు మాట్లాడుతూ ప్రజలు మో సపోయార ని గోస పడుతున్నారని వారి ఆలోచనలతో ఏకీభవించి, కసి తో పని చేసి, అత్యధిక మెజార్టీతో బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. బోనకల్ మండలం జానకీపురం గ్రామంలో మంగళవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నామ నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రజలు ఓట్లేసి ఇచ్చిన అధికారం వల్లనే రెండు సార్లు పార్లమెంట్ కు పోయి ప్రజల వాణిని, వారి గొంతుకగా వినిపించానని అన్నారు.నేను పార్లమెంట్ లో ఉన్నా ఎప్పుడూ జిల్లా ప్రజల జాసే ఉంటుందని అన్నారు. మళ్లీ మూడోసారి గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే మరింత అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు. కష్ట కాలం లో నన్ను గెలిపించి, కేసీఆర్ కు అండగా ఉండాలని పేర్కొన్నారు.కేసీఆర్ ఆశీర్వాదం తో పార్లమెంట్ లో ఎన్నో సమస్యలపై గళం విప్పి, కేంద్రంపై పోరాడి, అనేకమైనవి సాదించానని చెప్పారు.కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన తెలంగాణ ఎంపీలు ఏనాడు రాష్ర్టం గురించి మాట్లాడిన సందర్భం లేదన్నారు. తన కృషి వల్లనే జిల్లాలో రాష్ట్ర రహదారులు జాతీయ రహరులుగా మారాయని, భద్రాచలం – కొవ్వూరు ట్రైన్ కోసం 120 కి పైగా కేంద్రానికి లెటర్లు రాశానని, కేంద్ర మంత్రులను, అధికారులను పెద్ద ఎత్తున కలిసిన ఫలితంగా ఇవన్నీ సాధ్యమయ్యాయని అన్నారు. జిల్లా లో జరిగిన ప్రతి అభివృద్ధి లో నామ ముద్ర ఉంటుందని స్పష్టం చేశారు.10 ఏళ్లలో కేసీఆర్ దిశా నిర్దేశకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధిని సాధించిందని , వరి ఉత్పత్తి లో దేశంలొనే నెంబర్ వన్ ప్రగతి సాధించామని చెప్పారు. మాయ, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వల్ల ఈ నాలుగు నెలల కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలన వస్తే ఎలా ఉంటాదో గతంలో కేసీఆర్ చెప్పినట్లే కాంగ్రెస్ పాలన జరుగుతుందని, కష్టాలకు విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుతున్నారని అన్నారు.రైతు బిడ్డగా ప్రజల కష్టాలు దగ్గరగా కళ్లారా చూశాను… గత కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగు, తాగునీటి సమస్యలు తో పాటు అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎప్పుడూ ధర్నాలు చేసే వారమని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు దాపురించాయని అన్నారు.కష్ట కాలంలో పార్టీ అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని, తనను మంచి మెజార్టీతో గెలిపించి, కేసీఆర్ కు అండగా నిలవాలని నామ నాగేశ్వరరావు కోరారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నామను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని, బోనకల్ మండలం నుంచి మంచి మెజార్టీ తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. నామ గెలిస్తేనే తెలంగాణ ప్రజల హక్కులు కోసం, పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు , ఇతర సమస్యలు సాదించడానికి,పార్లమెంట్ లో జిల్లా వాణి వినిపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నామ గెలిస్తేనే తెలంగాణ బిడ్డల ప్రయోజనాలు నెరవేరుతాయని మధు అన్నారు.
రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటేరియన్ నామ గెలుపు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమన్నారు. నామను గెలిపించి కేసీఆర్ కు అండగా ఉండాలన్నారు. ఏదో జరుగుతుందని ప్రజలు ఆశించి, కాంగ్రెస్ ను గెలిపించారని, అదే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి, వాత పెట్టబోతున్నారని అన్నారు. నామ గెలుపు ఒక మైలు రాయిగా నిలిచి పోతుందని అన్నారు.జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ కష్టకాలంలో నామను మంచి మెజార్టీతో గెలిపించుకుని, కేసీఆర్ కు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అందరూ సమైఖ్యoగా కలసి పని చేసి, నామ కు మెజార్టీ తీసుకురావాలన్నారుపార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బంధం శ్రీనివాసరావు, బాణోత్ కొండ, మోదుగుల నాగేశ్వరరావు, జంగా రవి, గద్దల వెంకటేశ్వర్లు, వేమూరి ప్రసాద్, కాకాని శ్రీనివాసరావు , తన్నీరు రవి, నామ సేవా సమితి నుంచి రాజేష్, కృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు ను పార్టీ కార్యకర్తలు శాలువతో సత్కరించి, తమ అభిమానం చాటుకున్నారు.















