EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

“నా ఖమ్మం కోసం నేను”  క్రింద 11 లక్షలకు పైగా సేకరణ… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

“నా ఖమ్మం కోసం నేను”  క్రింద 11 లక్షలకు పైగా సేకరణ… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

12.09.2024ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్  ఇంఛార్జి  నలుబోల మధు శ్రీ ఖమ్మం.

“నా ఖమ్మం కోసం నేను” అనే కార్యక్రమం క్రింద జిల్లాలో ముంపు బాధితుల సహాయార్థం ప్రజల నుండి చేపడుతున్న విరాళం, ఉపయోగ వస్తువుల సేకరణకు మంచి స్పందన వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని వినాయక మండపాల వద్ద చేపట్టిన నా ఖమ్మం కోసం నేను కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నట్లు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమం క్రింద ఇప్పటివరకు 11 లక్షల 20 వేలకు పైగా సేకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇట్టి విరాళంతో పాటు, 7 వేల 419 కిలోల బియ్యం, 1230 జతల బట్టలు, 9 బ్లాంకేట్లు, 75 స్టేషనరీ నోట్ పుస్తకాలు, 2 జతల చెప్పులు, 2 ఇతర వస్తువులు నా ఖమ్మం కోసం నేను కార్యక్రమం క్రింద గ్రామాల నుంచి ముంపు బాధితుల సహాయార్థం సేకరించినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top