EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నేటి తరానికి తల్లే ప్రత్యక్ష దైవం …శివ లెంక నాగ ఉదయ లక్ష్మి

హైదరాబాద్ ఫిబ్రవరి 4 (ఈ బీ న్యూ స్);మాతృదేవోభవ సత్సంగ్ సమావేశం హిమాయత్ నగర్ బషీర్ లిబర్టీ ప్లాజా ఆఫీస్ లో శివ లెంక నాగ ఉదయ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్బంగా మాతృదేవోభవ అధ్యక్షుడు కేవీ శ్రీధర్ సంస్థ సభ్యులకు ఢిల్లీ నుంచి సందేశం పంపారు.మాతృదేవోభవ సత్సంగ్ సంస్థ ప్రస్తుత సామాజిక వ్యవస్థలో నేటి తరానికి మాతృ ప్రేమ యొక్క విలువలను తెలియజేసే విధంగా అంతర్జాతీయ అంతర్జాతీయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన శివ లెంక నాగ ఉదయ లక్ష్మి మాట్లాడుతూ మాతృ ప్రేమ గురించి వివరిస్తు భగవంతుడు ఉన్నాడు లేదో తెలియదు కానీ మాతృమూర్తి ప్రత్యక్ష దైవం అని అన్నారు. మాతృదేవోభవ సంస్థ నీ అభివృద్ధి చేసే దిశగా అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నమని చెప్పారు. అందుకు సభ్యుల సహకారం కావాలని కోరారు. సమాజంలో నవ తరానికి చైతన్యపరిచే విధంగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అంజనీదేవి మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రాధాన్యత విరుస్తూ వారి పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన చిత్రా,వాసుదేవ రావు, కొండలరావు, నవీన్, బాలాజీ, జగదీష్, విజయ, కనకదుర్గ, రమేష్, అరుణ రెడ్డి తదితరులు మాతృదేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top