జడ్చర్ల ఏప్రిల్ 11 (ఈతరం భారతం న్యూ స్);మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకొని జడ్చర్ల మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో బిసి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ పూల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవిద్య అజ్ఞానానికి, కుల వైశ్యమ్యాలే కారణమని గ్రహించిన పూలే, శూద్రవాడల్లో పాఠశాల ల ఏర్పాటు కోసం అవిరళ కృషి చేసి1848లో పూణే లో తొలి పాఠశాలఏర్పాటు చేసి, అణగారిన జీవితాల్లో అక్షర జ్యోతి వెలిగించిన గొప్ప సంఘసంస్కర్త పూలే అని కొనియాడారు. సామజిక సమానత్వం, సమరత కోసం కృషి చేసినమహాత్మా జ్యోతి బా పూలే ఆలోచనలను ఆచరిస్తూ ఆయన ఆశయాలను సాధించడమే మనము ఆయనకిచ్చే నిజమైన నివాళి, నేటి యువత ఆయన అడుగుజాడల్లో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి,కిషోర్ కుమార్,మల్లేష్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి,రామస్వామి మేస్త్రి,రవికుమార్, కొండల్ యాదవ్,రామస్వామి, యాదయ్య, కుర్మూర్తి, రాజు,పవన్ కళ్యాణ్, దశరథం,నారాయణ,పరమేష్,అశోక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు















