14.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
యూత్ ఐకాన్ ఉస్మానియా యూనివర్సిటీ న్యూ క్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జార్జ్ రెడ్డిహైదరాబాద్ చేగువేరా.జినా హైతో మర్నా సీకో… కధం కదం పర్ లడ్నా సికో అంటూ గర్జించిన జార్జ్.అతని పుట్టుక సహజమే కానీ అతని చావు చరిత్ర సృష్టించింది. తెలంగాణ భూభాగంలో పడ్డ ,కులమత దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడీ సమానత్వ సమాజాన్ని కాంక్షించిన ధీరుడతడు,ఉస్మానియా మట్టికి పట్టుదల నేర్పి విద్యార్థులెందరికో రోల్ మెడల్ గా నిలిచిన అకడమిక్ మేధావి అతడు,ప్రొఫెసర్లకే పాఠాలు చెప్పిన ఇంటలెక్చ్వల్ అతడు..చివరికి April 14,1972 ఉస్మానియా యూనివర్సిటీ లో నరహంతక గుండాల చేతిలో 24 కత్తి పోట్లకు గురై అమరుడాయ్యాడు జార్జ్ రెడ్డి. అప్పుడతని వయసు 25.















