EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పంచాయతీల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్ ఫిబ్రవరి 3 (ఈ బీ న్యూ స్);సర్పంచుల స్థానంలో గ్రామ పంచాయతీలకు నియమించబడిన ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ( సీతక్క )కోరారు.శనివారం ఆమె పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావుతో కలిసి ములుగు జిల్లా నుండి హాజరయ్యారు.ఇకపై గ్రామపంచాయతీలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులపై ఉందని, ముఖ్యంగా రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రత్యేక అధికారులు పని విషయంలో ఎక్కడ తగ్గొద్దన్నారు. ఈనెల 7 నుండి 15 వరకు గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ డ్రైవ్ లో గ్రామంలో శానిటేషన్ తో పాటు, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఉపాధి హామీ తదితర కార్యక్రమాల పరిశీలన,సమస్యలతో పాటు, 15 న గ్రామ ప్రజలు,మహిళా సంఘాలు, యువకులతో సమావేశం ఏర్పాటు చేసి సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగించాలని కోరారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాల బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. అలాగే మహిళా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఆదాయం వచ్చే మార్గాలను గుర్తించి వారు అభివృద్ధి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో బాగా పనిచేసిన వారిని గుర్తించి జిల్లా కలెక్టర్ ద్వారా సన్మానించాలని అన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని చెప్పారు. గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన గ్రామాలలో అందుబాటులో ఉండాలని ఆమె కోరారు. హైదరాబాద్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులకు వెంటనే ఒకరోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, గ్రామాలలో పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ప్రత్యేక అధికారులందరూ గ్రామపంచాయతీ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలని ,ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటి కనెక్షన్ ఉన్నది లేనిది సర్వే చేసి తెలుసుకోవాలని, జిల్లా కలెక్టర్ సైతం గ్రామాలను సందర్శించినప్పుడు పారిశుధ్యం ,తాగునీటిపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రామాలలో నర్సరీలతో పాటు, సెగ్రీగేషన్ షెడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సరిగా నిర్వహిస్తున్నది లేనిది చూసుకోవాలని, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామంలో వీటన్నిటిపై సమీక్షించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులతో పాటు, పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ నెల 7 నుండి 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ ను చేపట్టాలని ,వేసవిలో తాగునీటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రానున్న రెండు, మూడు నెలలు గ్రామపంచాయతీలపైనే ఎక్కువ దృష్టి సారించాలని, తాగునీటి వనరులన్నీ క్లోరిషన్ చేయాలని తెలిపారు. ఎక్కడైనా పైప్ లైన్లకు చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేపట్టాలని ఆదేశించారు .ప్రతి ఇంటి ద్వారా చెత్త సేకరణ తో పాటు, ప్రతి గ్రామపంచాయతీని ప్లాస్టిక్ రహిత గ్రామపంచాయతీగా చేసే విషయంపై చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాల ద్వారా పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టించే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రత్యేకత పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి భాగస్వామ్యం చేయాలని అన్నారు. జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని 441 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీధికి తగు సూచనలు ఇచ్చామని, సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తాగునీటిపై గుర్తించిన గ్రామాలు ,గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని, ఎక్కడైనా పైపులైన్లు లీకేజీ ఉన్నట్లయితే అరికడతామని, గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూస్తామని,ప్రస్తుతం ఉన్న సౌకర్యాలపై ఇంటింటి సర్వే తో పాటు, ఈనెల 7 నుండి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు .ఉపాధి హామీ పథకం కింద 14 కోట్ల రూపాయల విలువచేసే 285 పనులకు మంజూరు ఇవ్వడం జరిగిందని వాటిని గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పిసిఈఓ జ్యోతి, డిపిఓ వెంకటేశ్వర్లు ,మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటరమణ, డిఆర్డిఓ యాదయ్య, పి ఆర్ ఈ ఈ నరేందర్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top