హైదరాబాద్ మే 15 (ఈతరం భారతం న్యూస్);బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని,తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు.బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు అయ్యి లోపాయి కారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే సంపూర్ణాంగా మద్దతు పలికారన్నారు.రాబోయే ఫలితాలలో తెలంగాణ లో కాంగ్రెస్ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేసారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమన్నారు.కిషన్ రెడ్డి అభినవ గోబెల్స్ గా మారిపోయారని,అబద్దాలు ఆడడంలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతారన్నారు.బీజేపీ మాటలను ప్రజలు నమ్మలేదు.. ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం ఖాయం
..















