EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పద్మారావు కు మద్దతు ప్రకటించిన సికింద్రాబాద్ పద్మశాలి సంఘం

 

సికింద్రాబాద్ నవంబర్ 18 (ఈతరం ఇండియా న్యూస్);: సికింద్రాబాద్ నియోజకవర్గం లో బీ ఆర్ ఎస్ అభ్యర్ధి, డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ కు వివిధ వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో శనివారం సికింద్రాబాద్ పద్మశాలి సంఘం పద్మారావు గౌడ్ కు ఎన్నికల్లో మద్దతును ప్రకటించింది. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని ఆయిదు మునిసిపల్ డివిజన్ల పరిధులలో తమ అనుబంధ సంఘాలు బీ ఆర్ ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ కు అనుకూలంగా మద్దతునిస్తాయని సంఘం అధ్యక్షుడు కే.ఒడియన్ శ్రీనివాస్, కార్యదర్శి ఆదేపు రవి, కోశాధికారి అంకెం శ్రీకాంత్, నేతలు మంద జగన్, సీ హెచ్ మల్లేష్ లు ఓ ప్రకటనలో తెలిపారు. పద్మారావు గౌడ్ భారీ అడిక్యతతో విజయం సాధించేందుకు తమ సంఘం సహకరిస్తుందని పేర్కొన్నారు. కాగా పద్మశాలి సంఘం తనకు పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానించడం పట్ల పద్మారావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top