EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘భూమిని ప్రకృతి పై వ్యాసరచన పోటీలు

హైదరాబాద్ ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూస్ );ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం, జూన్ -5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 16 సంవత్సరాల లోపు విద్యార్థులకు ‘భూమిని – ప్రకృతిని ఎలా సంరక్షించుకోవాలి ’ అన్న అంశంపై వరల్డ్ వైడ్ ఆన్లైన్ చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య, గౌరవాధ్యక్షులు లక్ష్మీనారాయణలు తెలిపారు. మంగళవారం విలేకరులతో వారు మాట్లాడుతూ. …0 నుంచి 5వ తరగతి, 6నుంచి 10వ తరగతి వరకు జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు ఇంటివద్దే తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సహకారంతో పోటీలో పాల్గొనవచ్చు. పూర్తిచేసిన చిత్రాలు, వ్యాసాలు మే 25 లోపు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పంపాలి. చిత్రం (పెయింటింగ్) అయితే ఒక పేజీ లో, వ్యాసం అయితే రెండు పేజీల కు మించకూడదు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా పోటీలో పాల్గొనొచ్చు. ఒక్కో విభాగంలో 1st, 2nd, 3rd ప్రధాన బహుమతులతో పాటు అదనంగా మరో 10 మందికి కన్సొలేషన్ బహుమతులను అందించనున్నాము. విజేతలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ -5) సందర్భంగా బహుమతుల ప్రదాన వేడుక “గ్రీన్అవార్డ్స్-2 ” కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతుంది. దాంతోపాటు పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్ధికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఆన్లైన్ లో అందించడం జరుగుతుందన్నారు. వ్యక్తుల్లో, వ్యవస్థలో పర్యావరణ ఆలోచన -అవగాహన పెరగాలనేదే ఈ పోటీ ముఖ్య ఉద్దేశ్యం. అవగాహన లోపంతో ఇవాళ అనేక ప్రకృతి విపత్తులు, పర్యావరణ -వాతావరణ సమస్యలు మానవ సమాజం ఎదుర్కొంటోంది. ఆ సమస్యలు ఆగాలంటే ముందు ప్రకృతి పట్ల కొనసాగుతున్న మానవ ఉదాసీనత ఆగాలి. అది జరగాలి అంటే ప్రతి ఇంట్లో పర్యావరణంపై చర్చ జరగాలి. అందుకు రేపటి తరం ప్రతినిధులు అయిన విద్యార్థుల్లో ఆలోచన రగిలించాలి. ఆ ప్రయత్నమే ఈ కాంటెస్ట్ ఉద్దేశ్యమన్నారు. ఈ కాంటెస్టులో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 వ తరగతి (16 years) లోపు విద్యార్థులు అర్హులు. మే 25 వరకు పోటీదారులు పూర్తిచేసిన ప్రతులు పంపాలి. మే 31 లోపు విజేతల ప్రకటన ఉంటుంది. విద్యార్ధి ఒకటికి మించి అయినా పంపవచ్చు. ప్రతి అప్లికేషన్ దారు రిజిస్ట్రేషన్ ఫేజు 100/- phonepay లేదా Environment Protection Development Council, (Indian Bank – Miyapur Branch.A/C NO : 7587263110.IFScode: IDIB000M241) కు పంపించాల్సి ఉంటుంది. email : bettersocietyind@gmail.com,

whatsapp No : 8179019623 .Phonepay : 8179019623.గమనిక : పోటీ కి పంపే ప్రతితోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు రసీదు తప్పక జతచేయాలి. వివరాలకోసం 8179019623. సంప్రదించాలని వారు కోరారు

 

 

Related News

Select the Topic
Scroll to Top