పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి
ఆదిలీల ఫౌండేషన్ నేషనల్ జనరల్ సెక్రెటరీ శ్రీవాణి చందల్
హైదరాబాద్ సెప్టెంబర్ 3 (ఈతరం భారతం);:పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల ప్రతి ఒక్కరూ ప్రతిష్టించి పూజించాలని ఆదిలీల ఫౌండేషన్ నేషనల్ జనరల్ సెక్రెటరీ శ్రీవాణి చందల్ పిలుపునిచ్చారు.రసాయనలతో తయారుచేసిన విగ్రహాలకు బదులుగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినియోగిస్తే పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగదని అన్నారు.ఈ నెల 5 న ఆదిలీల ఫౌండేషన్ ఆద్వర్యం లో ఘటకేసర్ ఎన్ఎఫ్సీ నగర్ బీటు నందు మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదీ విదంగా హైదరాబాద్ నగరం లో పలు ప్రాంతాల్లో తమ ఫౌండేషన్ ఆద్వర్యం లో మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5 న జరిగే గణపతుల పంపిణీ కి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, స్థానిక కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి పాల్గొంటు న్నట్లు తెలిపారు.















