EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలి ఎన్విరాన్మెంట్ కౌన్సిల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్

హైదరాబాద్ జనవరి 29 (ఈ బీ న్యూ స్);మానవాళికి జీవ నాడి పర్యావరణమే అని, ఆ పర్యావరణాన్ని కాపాడుకొనే బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం ఆయన “ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ” రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఏ వ్యవస్థ అయినా, ఏ తరం అయినా అభివృద్ధి జరగాలి అంటే ప్రకృతి కరుణ ఉండాల్సిందేనన్నారు. నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి హైదరాబాద్ విభాగం అధ్యక్షులు నర్సయ్య, కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top