EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పర్యావరణ భావజాల పార్టీలను ఎన్నుకోవాలి – పర్యావరణ ప్రేమికులు ప్రజలకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి

హైదరాబాద్ మే 8 (ఈతరం భారతం న్యూ స్); పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించే పార్టీలకు మాత్రమే రానున్న ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య బుధవారం బాగ్ లింగం పల్లిలో విలేకరులతో మాట్లాడారు. దశబ్దాలుగా రాజకీయపార్టీలు పర్యావరణ పరిరక్షణ ఊసు చేయలేదని, దీంతో ప్రకృతి విపత్తులు సమాజాన్ని ఇబ్బందులకు గురించేస్తున్నాయని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితమే ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ గురించి హెచ్చరించినా పాలుకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించారని ఆరోపించారు. ప్రకృతి పై ఉదాసీనత ప్రమాదం అని తెలిసినా పట్టించుకోని రాజకీయ పార్టీలను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంత ఎండలు భయపెడుతున్న వేళ గౌరవ ప్రదమైన గెలుపుకోసం రాజకీయ పార్టీలు తక్షణమే ప్రత్యేకంగా పర్యావరణ పాలసీ ప్రకటించి ఓట్లు అడగాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక ప్రగతికి పర్యావరణ పరిరక్షణే కీలకమని ఆయన రాజకీయపార్టీలకు గుర్తు చేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top