పాముతో పరాచికం.. ప్రాణాలు కోల్పోయిన వైనం
బాన్సువాడ సెప్టెంబర్ 6 (ఈతరం భారతం);: విష సర్పంతో విన్యాసం యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నది. నాగుపామును పట్టిన తర్వాత.. ఫోటోలకు ఫోజు ఇచ్చేందుకు ఆ పాము తలను నోట్లో పెట్టుకున్నాడు ఓ యువకుడు. అయితే ఆ విన్యాసం కాస్త వికటించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని దేశాయిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాములు పట్టే(Snake Catcher) శివ ఆ పాము కాటుకు బలయ్యాడు. నోట్లో పాము తలను పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ సముదాయంలోకి దాదాపుగా 6 ఫీట్ల అడుగుల నాగుపాము వచ్చింది. దాన్ని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్ శివకు సమాచారం అందించారు. నాగుపామును పట్టుకున్న శివ దానిని అలాగే నోట్లో పెట్టుకుని గ్రామస్థుల ముందు విన్యాసాలు చేశాడు.పాము తలను నోట్లో పెట్టుకుని ఫోటోలు దిగాడు. కొందరు దీన్ని వీడియో కూడా తీశారు. ఇంతలోనే ఆ పాము నోట్లోనే కాటు వేసినట్లు తెలిసింది. నోట్లో నాగుపాము తలను పెట్టుకొని సాహసాలు చేస్తున్న సమయంలో పాము కాటు వేసిన విషయాన్ని శివ గ్రహించలేకపోయాడు. ఇంటివద్ద అచేతనంగా పడి ఉన్న శివను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చెందినట్లు వైద్యులు తెలిపారు.నోట్లో నాగుపాముతో ఫోటోలకు ఫోజు.. ప్రాణాలు కోల్పోయిన స్నేక్‌క్యాచర్.. వీడియో : నాగు పామును పట్టుకున్నాడు. అందరి ముందు దాని తలను నోట్లో పెట్టుకున్నాడు. ఫోటోలు, వీడియోలు దిగాడు. కానీ ఆ సమయంలోనే ఆ పాము అతని నోట్లో కాటేసింది. ఆ తర్వాత ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నోట్లో పాముతో స్టంట్ చేస్తున్న ఆ యువకుడి వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.















