హైదరాబాద్(ఈతరం భారతం న్యూ స్);: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని గుర్తుచేశారు. ఆ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దం అని ఉత్తమ్ తేల్చి చెప్పారు. కేసీఆర్ పాస్ పోర్టులు విక్రయించి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా తాను పనిచేయలేదని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వివరించారు. వ్యవసాయశాఖపై అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో కేసీఆర్ ఏం చేశారని అడిగారు. ఆ సమయంలో ఇంట్లో పడుకొని, ఇప్పుడు అరుస్తారా అని ఉత్తమ్ విరుచుకుపడ్డారు
.















