EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పిల్లల భావోద్వేగాలను తల్లిదండ్రులె పసిగట్టి పరిష్కరించాలి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బండారి జగదీష్

హనుమకొండ మే 5 (ఈతరం భారతం న్యూ స్);బాల సంస్కార్ వేసవి 10 రోజుల శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం రోజున తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై వరంగల్ పట్టణంలోని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బండారి జగదీష్ చే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు టీనేజ్ లోకి వచ్చే క్రమంలో వారిలో మానసికంగా, శారీరకంగా వచ్చే మార్పులను తల్లిదండ్రులు గుర్తించి వారి అభిప్రాయాలను వినాలని వారి వ్యక్తిత్వాన్ని గౌరవించాలని చెప్పారు. శారీరక బాధలలాగానే మానసిక సమస్యలు సైతం సర్వ సాధారణమని, సత్వర పరిష్కారం కొరకు సైకియాట్రిక్ కేర్, అవసరమైన కౌన్సిలింగ్ చేయించాలని తెలిపారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సమాధానం ఇచ్చారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రామకృష్ణ సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యంగా భవిష్యత్తరాలను నైతికవిలువలతో ఎదిగేలా మరియు మన సంస్కృతీసంప్రదాయాలను గౌరవించేలా తీర్చి దిద్దే ప్రాంగణంగా భాసిల్లుతుందన్నారు. భగవాన్ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరానికి ప్రజల సహాయ సహకారాలు అందించాలని కోరారు. శిక్షణ శిబిరానికి హాజరైన పిల్లలచే తల్లిదండ్రులకు “పాదపూజ” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లలకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు వారిని గౌరవించడం, వారి పట్ల అభిమానాన్ని ఆప్యాయతను కనపరచడం పిల్లల నైతిక బాధ్యత. అదేవిధంగా పిల్లలను ఉత్తమ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల ధర్మం. ఈ రెండింటి మేలవింపు కార్యక్రమమే పాదపూజ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు&తల్లిదండ్రులు భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి హనుమకొండ ప్రధాన కార్యదర్శి జినుగు విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధికారి కే వీ రావు, బాలసంస్కర్ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణ, స్వరూప, రాధిక, సేవా సమితి సభ్యులు తిరుపతిరెడ్డి, కేదారి,అశోక్ రెడ్డి, అంజనీ దేవి, లక్ష్మీదేవి,పార్వతి, సరోజ,అనిత, శిల్ప మరియు వాలంటీర్లు వీణ, విష్ణు, పరశురాములు, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top