EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పి ఎస్ జి ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

 

చౌటుప్పల్ డిసెంబర్ 16 (ఈతరం ఇండియా న్యూస్ ): పాలకుర్ల శివయ్య గౌడ్ స్మార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని స్థానిక ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాల గాంధీ పార్క్ లో క్విజ్ వ్యాసరచన, చిత్రలేఖనం, వంటి వాటిలో పోటీలను కళాశాల విద్యార్థులకు నిర్వహించారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు నార్కట్పల్లి హెల్త్ సూపర్వైజర్ బడుగు శ్రీరాములు చేతులమీదుగా బహుమతి ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బడుగు శ్రీరాములు మాట్లాడుతూ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొంటే ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని ఒకేషనల్ కోర్సులలో తొందరగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తక్కువ సమయంలో విద్యార్థులు తమ భవిష్యత్తు కు పొందుపరచుకోవచ్చునని సూచించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ పాలకూర్ల మురళి మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని, దేశ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిలివేరు ధనలక్ష్మి ప్రిన్సిపల్ సీనియర్ శ్రీనివాస్ కళాశాల బృందం బి. పూజ, యువరాజు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top