నిర్మల్ సెప్టెంబర్ 18 (ఈతరం భారతం);పీఎం విశ్వకర్మ యోజన కుల వృత్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.ఈ పథకం కింద తెలంగాణలో మహిళ లబ్దిదారు నిర్మల్ జిల్లా కాల్వ గ్రామానికి చెందిన మా రాజుల లక్ష్మి కావడం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా లక్ష్మీ రాజేశ్వర్ ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సన్మానించారు.ఈనెల 20 తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా లక్ష్మీ చెక్కు ను అందుకోనున్నారు.















