ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 31.3.24 సికింద్రాబాద్ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రభుత్వ పాలన శాస్త్రం ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశం సికింద్రాబాద్ పీజీ కళాశాల అధ్యయన కేంద్రంలో ఆదివారం జరిగింది. విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పీజీ పూర్తి చేసిన తరువాత పరిశోధనల వైపు విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. సమయ పాలన, ప్రణాళికతో భవిష్యత్తులో ముందుకు సాగాలని చెప్పారు. సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ప్రేమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాలనశాస్త్ర విద్యార్థులు సమకాలీన వ్యవస్థల్లోని పరిపాలన పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని అన్నారు. పరిపాలన పద్ధతుల్లో కాలానుగుణంగా వచ్చే మార్పులను విద్యార్థులు తెలుసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలనాశాస్త్ర కౌన్సిలర్లు, పీజీ కళాశాల కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తమకు తరగతులను బోధించిన అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.















