నర్సాపూర్ మే 9 (ఈతరం భారతం న్యూ స్);పేదలకు శక్తి దొరికింది కేవలం రాజ్యాంగం వల్లనే నని, రాజ్యాంగం సామాన్యుల గొంతుక అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. నర్సాపూర్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.పేదలు,రైతులు, ఆదివాసీలు, గిరిజనులకు భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందన్నారు.రాజ్యాంగానికి ముందు వెనుకబడిన వర్గాలకు ఎలాంటి హక్కులు లేవు,వేలాది మంది త్యాగఫలమే రాజ్యాంగం మన్నారు.గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ కలిసి ఏళ్లపాటు చమట్చోడి రాజ్యాంగాన్ని అందించారు..
రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు చెబుతున్నారు..ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయి..ఒక వైపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ , ఖర్గే ,రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని మార్చవద్దని అంటున్నారు..మోదీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు…రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం.. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు…దేశంలోని 25 మంది పెట్టబడిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందాలని మోదీ అనుకుంటున్నారన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారు.రిజర్వేషన్లు ఎత్తివేయడం కోసమే ప్రైవేటీకరణ …పెట్టుబడి దారి వ్యవస్థ ను పెంచడం వెనుక రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర..ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కుల గణనను చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. దేశంలో తొంభై శాతం ఉన్న ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదు..దేశంలో కులగణన చేయాలన్నదే మా సంకల్పం దేశంలో వెనుకబడిన వర్గాల వారి శక్తి ఎంతో తేలాల్సి ఉందన్నారు.కులగణన తర్వాత దేశంలో రాజకీయ చైతన్యం వస్తుంది..దేశంలో తొంభై శాతం సంపద రెండు శాతం మంది దగ్గర ఉంది..దేశాన్ని వారే శాసిస్తున్నారు..పదేళ్ల పాటు ప్రధాని మోదీ అదానీ కోసం పనిచేశారని విమర్శించారు.దేశంలో విమానాశ్రయాలు, పోర్టుల, ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీకి కట్టబెట్టారు… కోట్లాది మందిని ధనికులు గా మార్చే సమయం ఇప్పుడు ఆసన్నం అయింది..చారిత్రాత్మక రాజకీయ చైతన్యానికి కాంగ్రెస్ స్వీకారం చుట్టబోతుంది..పేదల స్వప్నాన్ని సాకారం చేసిచూపెట్టబోతున్నామన్నారు..ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు..దేశం లోని నిరుపేదల జాబితాను సిద్ధం చేస్తున్నాం..తెలంగాణ మారుమూల ప్రాంతాల్లోని పేదల జాబితా కూడా సిద్ధం చేస్తాం..ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి అకౌంట్ లో యేడాదికి లక్ష రూపాయలు వేస్తాం..కోట్లాది కుటుంబాల్లో మహిళల అకౌంట్ లో ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ చేయబోతున్నాం…ఒక్క దెబ్బతో దేశంలో పేదరికాన్ని నిర్మూలించ బోతున్నాం..ప్రధాని మోదీ దేశంలో కోట్లాది మందిని నిరుద్యోగులు గా మార్చారు…మొదటి ఉద్యోగం పక్కా అన్న నినాదంతో ముందుకు వస్తున్నాం..జూన్ 4న దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది..ఆగస్టు 15న నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం…కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తాం…వ్యవసాయ ఉత్పత్తులకు మోదీ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదు..
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు మద్దతు ధర గ్యారెంటీగా ఇస్తాం..అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీ వేతనం రోజుకు 400 వందలకు పెంచుతాం..మోదీ ఎంత సొమ్ము పెద్దలకు ఇచ్చాడో అంత సొమ్మును మేం పేదలకు పంచుతాం..రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలకు ఉంది…తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేస్తోంది…ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది…తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఢిల్లీ లో నేను చేసిపెడతానన్నారు.















