గోదావరిఖని నవంబర్ 15, (ఈతరం ఇండియా న్యూస్ ); రాష్ట్రంలోని పేద బడుగు బలహీన కార్మిక కర్షక కూలీల జీవితాల్లో వెలుగులు నింపేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎం. ఎస్.రాజ్ ఠాకూర్ అన్నారు.రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు- 5 పై బుధవారం సంఘటిత అసంఘటిత జిల్లా కన్వీనర్ పెంచాల తిరుపతి ఆధ్వర్యం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఐ.ఎన్.టి.యు.సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ప్రాజెక్టు ఆవరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. అనంతరం ప్రాజెక్టులో ఉన్న కార్మికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకుని ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా సురక్షిత పరిపాలన చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణిలో అనేక ప్రమాదాలు జరుగుతున్నయన్నారు. కార్మికులను కలిసే స్వచ్ఛ కూడా యాజమన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.. ఎన్నికల కమిషన్ ఆలోచించి కార్మికుల కలిసి ఓటు అడిగే హక్కు కల్పించాలని కోరారు. సింగరేణి నిధులను దుర్వినియోగం పరిచిన కెసిఆర్ ప్రభుత్వనికి బుద్ది చెప్పాలని అన్నారు.. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికుల కష్టాలు తీరుస్తామని అండగా ఉంటామని తెలిపారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.అంతకు ముందు ఫైవింక్లైన్ ఏరియా చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఒగ్గు డోలు కళాకారుల ఆట పాటలతో… టపాసులు మోతలతో ప్రాజెక్టు వరకు చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, ఐ.ఎన్.టి.యు.సి నాయకులు, కార్పోరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు
















