14.1.2024 ఖమ్మం బ్యూరో,నలుబోల మధులత (eetaram bharatam news)తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇన్ చార్జి తుంబూరి దయాకర్ రెడ్డిని పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ క్యాంప్ ఆఫీస్ లో కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వపు నిరంకుశత్వ చీకటి పాలన నుండి నిజమైనప్రజల పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామము సుఖశాంతులతో పాడిపంటలతో పచ్చని పైరులతో కళకళలాడుతూ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ను కలిసి పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పల్లెప్రజల జీవన సంస్కృతికి అద్దం పట్టే, ముఖ్యంగా రైతులకు మహిళా సోదరీమణులకు అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలు ప్రశాంత జీవనం గడపాలని, గత ప్రభుత్వం హయాంలో నాయకులు పైరవీకారులు దళారులు మాత్రమే అభివృద్ధి చెందారని కాంగ్రెస్ ప్రభుత్వంహయాంలో రాబోయే రోజులలో తెలంగాణలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతుందని, అవినీతి అక్రమాలకు ఆస్కారం లేని విధంగా పాలన ఉంటుందని మల్లి బాబు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల మహేష్ మేకల మల్లికార్జునరావు, సర్పంచ్ పరికపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు















