ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖానాపురం హవేలీ బహుజన కార్మిక సంఘాల సమైక్య (B. F. T. U) ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి Bftu ఖమ్మం జిల్లా అధ్యక్షులు తోటపల్లి శ్రీను అధ్యక్షతన మేడే దినోత్సవన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోడకంటి రాంబాబు మాట్లాడుతూ ఈ దేశంలో పెట్టుబడుదారులన్న, సామ్రాజ్యవాదులన్న బ్రాహ్మణ, అగ్రకులాలే వీరి రాజకీయ ఆధిపత్యాన్ని కూల్చి బహుజన రాజ్యం సాధించుకోటమే శ్రామిక రాజ్యం సాధించుకోవటం అని.. అందుకు దళిత బహుజనులు తమ ఓటు తాము వేసుకొని రాజులయ్యి పై కులాలు మోసం చేసి కూడబెట్టిన సంపదను జాతీయం చేయాలని సూచించారు…bftu ఖమ్మం జిల్లా నాయకులు బానోత్ కిసాన్ నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ శ్రామిక కులాల తరఫున ఎన్నో హక్కులు కల్పించడం వల్ల ఈ కాస్తంత శ్రామిక కులాలకు వెలుగు వచ్చింది.అన్నారు. బహుజన నాయకులు లింగన్న బోయిన లక్ష్మణ్ గారు మాట్లాడుతూ 12 గంటల పని దినాన్ని అంబేద్కర్ గారు ఎనిమిది గంటల పని దినం రాజ్యాంగం ద్వారా మనకు హక్కును కల్పించాడు.. అంబేద్కర్ గారు కార్మికులపక్షపాతి.అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాల గుతపదెబ్బ నాయకులు దారా వెంకయ్య, శ్రీను, తదిత రులు పాల్గొన్నారు.















