EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

“ప్రకృతిని కాపాడుకోవడం ఎలా ” ట్రస్మా పోటీ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ మే 4 (ఈతరం భారతం న్యూ స్); జూన్ 5 ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల స్థాయి విద్యార్థులకు “భూమిని- ప్రకృతిని కాపాడుకోవడం ఎలా? ” అన్న అంశంపై పెయింటింగ్, ఎస్సేరైటింగ్ విభాగాల్లో గ్లోబల్ ఆన్లైన్ కాంటెస్ట్ జరుగుతోంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ సంస్థ తెలంగాణ గుర్తింపు స్కూల్స్ సంఘం (ట్రస్మా ) సహకారంతో జరుగుతున్న ఈ పోటీ పోస్టర్ ట్రస్మా అధ్యక్షులు సాదుల మధుసూదన్, ట్రస్మా అడ్వైజర్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ఎన్విరాన్మెంట్. ..కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య తదితరులు బాగ్ లింగంపల్లి లోని కౌన్సిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాదుల మధుసూదన్ మాట్లాడుతూ….ప్రకృతి వనరులు నిరంతరం దోపిడీకి గురవడం, మానవ ఉదాసీనత కారణంగా కాలుష్యాలు పోగుపడుతూ పర్యావరణం మనుగడ కోల్పోతోందన్నారు. దీంతో భావితరాల పరిస్థితి ఇబ్బందిగా మారనుందన్నారు. ఈనేపథ్యంలో కౌన్సిల్ నిర్వహిస్తున్న పోటీ వల్ల సమాజంలో ప్రకృతి పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. రంగయ్య మాట్లాడుతూ విద్యార్థులు 25వ తేదీ లోపు తమ పూర్తి చేసిన పోటీ ప్రతులు పంపాలి. విజేతలను రెండు విభాగాలుగా విభజించి క్యాష్ ప్రైజ్ తోపాటు గ్రీన్ అవార్డు -2 ప్రదానం జరుగుతుంది . పోటీలో పాల్గొనే ప్రతి విద్యార్ధికి పార్టీసిపెషన్ సర్టిఫికెట్ పంపడం జరుగుతుంది. పోటీకి విద్యార్థుల కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవచ్చు. పోటీలో పాల్గొనేవారు 100/- 81790 19623 కు ఫోన్ pay చేసి, ఆ రిసిప్ట్, పోటీ ప్రతినిధి 8333949623 వాట్సాప్ కానీ bettersocietyind@gmail.com మెయిల్ కు పంపాలి.

 

 

Related News

Select the Topic
Scroll to Top