EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రజలకు నా పక్షం లో ఉన్నారు – పక్కా గెలుస్తాం సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ నెల 18 న కే టీ ఆర్ రోడ్ షో విజయవంతం చేయాలి

సికింద్రాబాద్ నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్); : ప్రజలకు నిరంతరం తాము అందుబాటులో ఉన్నామని,. వర్షా కాలంలో సైతం ఏ ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేసామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి బుధవారము అయినా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని జామే ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో అయిన పర్యటించారు.ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ,గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని, సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను నిరంతరం తీసుకొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నిలిచిన తమకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ కంది శైలజ తో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ఈ నెల 18 న కే టీ ఆర్ రోడ్ షో విజయవంతం చేయాలి

 

బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు ఈ నెల 18 వ తేదిన నిర్వహించే రోడ్ షో విజయవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. రోడ్ షో ఏర్పాట్ల పై ఆయన బుధవారం అడ్డగుట్ట లో పర్యటించారు. కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తో పాటు నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 18 వ తేదిన గోషామహల్, సికింద్రాబాద్ లలో కే టీ ఆర్ పర్యటించి పార్టీ విజయానికి ప్రచారం చేస్తారని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రెండు ప్రదేశాల్లో రోడ్ షో సభలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు.

Related News

Select the Topic
Scroll to Top