EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రజలను చైతన్య వంతం చేసేది సాహిత్యం   శ్రీలేఖలు కవిత సంపుటి ఆవిష్కరణ సభలో వక్తలు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 ( న్యూ స్);: ప్రజలను చైతన్య వంతం చేసేది సాహిత్యమని , మనుషుల్లో నిద్రాణమైన సూక్తులను బయటకు తెచ్చి సమాజానికి దిక్సూచిగా రచయితలు పనిచేస్తారని రాజ్య సభ సబ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రవీణ్ శ్రీ రచించిన శ్రీలేఖలు కవిత సంపుటి పుస్తకాన్ని ఆర్.కృష్ణయ్య ప్రముఖ సినీ నటుడు సుమన్ తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ ఆవిష్కరించారు.అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ సమకాలీన ఆర్థిక, సామాజిక అంశాలను ప్రభావ సీలమనిన రచనలతో ముందకి వచ్చి, కొత్త ఆలోచనలతో సామాజిక భాద్యతగా కృషి చేయాలి అన్నారు. బ్రష్టు పట్టిన రాజకీయాల ప్రక్షాళన కోసం భవిష్యత్తులో మంచి రచనలు చేయాలని రచయిత ప్రవీణ్ ను సూచించారు. సినీ గీత రచయిత సిరా శ్రీ మాట్లాడుతూ వసంత పంచమి, ప్రేమికుల దినం సందర్భంగా నేను ముందు మాటలు వ్రాసిన 80కి పైగా కవితలు ఉన్న ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, మాజీ DCP ఆర్ ఎస్ ఐ భద్రినాత్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అద్యక్షులు వేణుగోపాల్ నాయుడు, చిన్న శ్రీశైలం యాదవ్, జర్నలిస్ట్ సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత ప్రవీణ్ ను మాజీ డిసిపి బద్రీనాథ్ తో కలిసి ఘనంగా సన్మానించారు.

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top