EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే మోడీ లక్ష్యం             దేశ అభివృద్ధి కొరకే జమిలి ఎన్నికలు        బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ సెప్టెంబర్ 18 (ఈతరం భారతం);దేశంలో అన్ని సామాజికవర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే లక్ష్యంగా మోడీ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.బుదవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కార్మిక, కర్షక, శ్రామికుల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వెళ్తోందని,.మహిళల సాధికారత కోసం మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు..75 ఏళ్ల పైబడిన ఆరు కోట్ల మందికి హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేశారు.పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈకో సిష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు.మ్యాన్ ఫ్యాక్చర్ హబ్ గా ఇండియా వేగంగా దేశం అభివృద్ధి చెందుతోంది.ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ నిలబడబోతోండాంటే అది ప్రదాన మంత్రో నరేంద్ర మోడీ కృషి పట్టుదల అన్నారు

జమిలీ ఎన్నికల పై స్పందిస్తు దేశ అభివృద్ధి కొరకే జమిలి ఎన్నికలు.జమిలి తో సమయం డబ్బు రెండు అదా అవుతాయి.దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతుంది.దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు.జమిలీ ఎన్నికలకు కొంత సమయం పడుతుంది.అందుకే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల కు ఎన్నికలు. పార్లమెంట్ లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తది.ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే చర్చలో చెప్పొచ్చునన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top