8.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల. ఖమ్మం.
జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జీవితంలో సుఖం, దుఃఖం కష్టం నష్టం అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడలానే సందేశం ఉగాదికి తయారు చేసే షడ్రుచుల సమ్మేళనం తెలియజేస్తుందని పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇచ్చిన మెజారిటీని రాహుల్ గాంధీకి ఇచ్చి ప్రధానిగా చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి, సంక్షేమం సునాయాసంగా సాధించవచ్చని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు.















