ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలి
పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి
ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పిలుపు
మేడ్చల్ సెప్టెంబర్ 5 (ఈతరం భారతం);ఆదిలీల ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీవాణి చందేల్ ఆధ్వర్యంలో గురువారం ఘట్కేసర్ లోని ఎన్ ఎఫ్ సి నగర్ లో ఉచితంగా వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉచిత గణేషుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు వాడి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముల్లి జంగయ్య యాదవ్ ఎన్ఎఫ్సీ నగర్ కౌన్సిలర్ కొమ్మ గాని రమాదేవి మైపాల్ గౌడ్, ఏడవ వార్డు కౌన్సిలర్ సాలూరు నాగజ్యోతి ఎన్ఎఫ్ సి నగర్ వార్డు నెంబర్ 2 అధ్యక్షులు యాదగిరిరావు ఎన్ ఎఫ్ సి నగర్ మహిళా నాయకురాలు మమతా శర్మ ఆదిలీల ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి నల్ల నాగేంద్రరావు భబితారాణి, గజానంద్, బాల్రెడ్డి, సల్ల శివ తదితరులు పాల్గొన్నారు















