హైదరాబాద్ నవంబర్ 10 (ఈతరం ఇండియా
న్యూస్ ); దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిందాల కృష్ణ (మిత్రకృష్ణ) ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కార్వాన్, జియాగూడ ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత మిత్రకృష్ణ ఓపెస్టాప్ జీపులో వేలాది మంది పార్టీ. నేతలు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులతో కలిసి భారీ ర్యాలీగా గోల్కొండ ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని తన ఎన్నికల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రచార రథం ముందు కళాకారుల నృత్యవిన్యాసాలు, బారాస పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళామణులు సైతం నృత్యాలు చేస్తూ ఆటపాటలతో అలరిస్తూ ర్యాలీని ఉత్సాహభరితంగా కొనసాగించారు. ఈ సందర్భంగా మిత్రకృష్ణ మాట్లాడుతూ కార్వాన్ మజ్లిస్- బీఆర్ఎస్ పార్టీల మధ్య అసలు సిసలైన ఎన్నికల పోటీ నెలకొందని, ఈ సంగ్రామంలో తన గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ఈసారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపట్టనుందని, ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీవైపే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ‘పార్టీ రాష్ట్ర నేతలు శేఖర్‌రెడ్డి, కావూరి వెంకటేశ్, అభిషేక్ మిత్రా, తెలంగాణ ఉద్యమకారులు యాద శ్రీనివాస్ గుప్తా, నరహరిచారి, సి బాబు, నర్మద, అనిత, ఉమేష్, కిశోర్, విజయ్, కేశవ్, శంకర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.















