మార్గదర్శకాలు….
· 7వ తరగతి వరకు కృత్యాలు, సూచనలు, ప్రయోగాలకు, ఆటలను తెలుగు, ఉర్దూలో నిర్వహించినా.. ఇదంతా 8, 9 తరగతుల్లో పూర్తిగా ఇంగ్లిష్‌లోనే జరగాలి. ఈ విద్యార్థులు టెన్త్వచ్చేసరికి ఇంగ్లిష్వాడాలి.
· ఇంగ్లిష్ నైపుణ్యాల వృద్ధికి టీచర్లు దీక్షా పోర్టల్, ఇతర వెబ్సైట్ల వీడియోలను వినియోగించుకోవచ్చు.
· మౌఖిక కార్యకలాపాల ద్వారా విద్యార్థులు కాన్సెప్ట్‌ను సహేతుకంగా తెలుసుకొన్నాక, పాఠ్యాంశాలను ఇంగ్లిష్‌లో చదవడం అనుసరించాలి.
· బోధనలో బహులభాషలు వాడాలి. ముఖ్యమైన ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయాలి.
ఇంగ్లిష్ దినపత్రికలు, మ్యాగ్జిన్లు చదవాలి. ఇంగ్లిష్ టీవీ చానళ్లను వీక్షించాలి.















