ఈతరం భారతం ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు : 18.9.24 : తెలంగాణ ధార్మిక పరిషత్ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్యస్వామి బుధవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, టిపిసిసి అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజును భువనగిరి వివేరా హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముగ్గురు ప్రముఖులను అంజయ్యస్వామి సన్మానించి యాదాద్రి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ మార్కెట్ చైర్మన్ పోత్నక్ ప్రమోద్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.















