హైదరాబాద్ మే 17 (ఈతరం భారతం న్యూ స్);హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను సుఫారీ ఇచ్చి హత్యచేయించింది ఓ భార్య. గుండెపోటుతో మరణించాడని ఎవ్వరికీ అనుమానం రాకుండా దహనసంస్కారాలు కూడా చేసింది.ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత నిందితుడు లొంగిపోవడంతో అసలు విషయం బయటపడింది. మధురానగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎహైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడలో జయప్రకాశనగర్ లోని శిఖర అపార్డ్ మెంట్ లో నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్ కుమార్(40)కు భార్య శ్రీలక్ష్మి (33), ఇద్దరు మగ పిల్లలు (9, 8 ఏండ్లు) ఉన్నారు. కొంత కాలంగా బోరబండకు చెందిన రాజేశ్ (30)తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. వీళ్ల బంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి ప్రియుడితో కలిసి మర్డర్ కు ప్లాన్ చేసింది. భర్త పేరు మీద మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇండ్లు ఉన్నాయి. భర్తను హత్య చేయించి ఎంజాయ్ చేద్దాం అనుకుంది. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగో లేదని చెప్పి శిఖర అపార్టమెంట్ కు మకాం మార్పించి మర్డర్ కు ప్లాన్ చేసింది.















