10.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్) తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు.
10.02.2024 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈరోజు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తరువాత అభివృధి సంక్షేమం దిశగా ప్రజాపరిపాలనలో ప్రజారంజకంగా ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తోనే ప్రజల కష్టాలు దాదాపు తీరిపోనున్నాయని ఆయన తెలిపారు.
బడ్జెట్ లో ఇందిరమ్మ ఆరు గ్యారెంటీల కోసం 53,196 కోట్లు.
విద్యా,వైద్య రంగానికి 32,889 కోట్లు.
గిరిజన,దళితుల,మైనారిటీ,
బీసీ,సంక్షేమం కోసం 46,695 కోట్లు.
గృహ నిర్మాణానికి 7740 కోట్లు
వ్యవసాయానికి పెద్ద పీట వేశారు.
ఇందిరమ్మ రాజ్యం కోసం బడ్జెట్ కేటాయించడం అభినందనీయం అని ఆయన చెప్పారు















