5.4.2024 ఈతరం భారతం రీజనల్ నెట్వర్క్ ఇంఛార్జి నలు బోల మధు శ్రీ :
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 117 వ జయంతి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారితో కలిసి Dr బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు మాట్లాడుతూ..బిజెపి పాలనలో దేశం రకరకాల అసమానతలు వ్యత్యాసాలతో విచ్ఛిన్నమైపోతుంది. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఈ దేశాన్ని అద్భుత జాతిగా నిర్మించిన బాబు జగ్జీవన్ రామ్ బాటలో ఈ దేశ ప్రజానీకం నడవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు.బాబు జగ్జీవన్ రామ్ భారతదేశంలో పుట్టడం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను
జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రి గానే కాకుండా అనేక రకాల శాఖల మంత్రిగా ఆయన దక్షతతో వ్యవహరించారు. జగ్ జీవన్ రామ్ పాలన అనుభవం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడింది.చట్టసభల్లో మాట్లాడిన తీరు ప్రజా జీవితంలో వారు గడిపిన తీరు. దేశంలోని బడుగు బలహీన వర్గాల గురించి కాకుండా దేశ సంక్షేమం కోసం వారు అనేక ప్రణాళికలు రచించారు. దేశ ఔన్నత్యానికి పునాదులు వేశారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా రూపొందించడంలో ఆయన పాత్ర కీలకం.
ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలన్న రాజ్యాంగబద్ధ పాలన జరగాలన్న బాబు జగ్జీవన్ రామ్ బాటలో దేశ ప్రజలు పయనించాలన్నారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్,జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య,నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్, రరాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ రాయల నాగేశ్వరరావు, పిసిసి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, ఖమ్మం నియోజక పార్లమెంటరీ ఎన్నికల ఇంఛార్జి శివ కుమార్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు డాసరి దానియల్,జిల్లా INTUC ,మహిళా, యువజన, మైనారిటీ, కిసాన్ కాంగ్రెస్, SC సెల్ అద్యక్షులు కొత్తా సీతారాములు,దొబ్బల సౌజన్య,యాడ్లపల్లి సంతోష్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు, దుద్దుకూరి వేంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్, రాపర్తి శరత్ ,మిక్కిలినేని మంజులనరేందర్, పల్లెబోయిన భారతి చంద్రం, గజ్జెల లక్ష్మీవెంకన్న, జిల్లా OBC సెల్ ఉపాద్యక్షులు గజ్జెల్లి వెంకన్న, బొమ్మిడి శ్రీనివాస్, మోతుకురి ధర్మారావు, వనం ప్రదీప్తచక్రవర్తి (బాబు), నగర OBC సెల్, మైనారిటీ సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, షేక్ అబ్బాస్ భేగ్, బండి నాగేశ్వరరావు, అంజని కుమార్, రజి, తవిడబోయిన రవి, బండి రమేశ్, శ్రీను, అనిల్ కుమార్, ఏలూరి రవికుమార్, కొట్టేముక్కల నాగేశ్వరరావు, కమతం రామక్రిష్ణ, అక్కినేని పూర్ణ చందర్ రావు, గడ్డం వెంకటయ్య,విప్లవ కుమార్,Md Y పాషా, వేణు, షేక్ అబ్దుల్ రెహమాన్, ప్రతిభారెడ్డి, కొత్తపల్లి పుష్ప, రెంటాల ప్రసాద్, తలారి నాగభూషనం, సుదర్శన్, జాని, అవేజ్, రాకేశ్,తదితర నాయకులు పాల్గొన్నారు.















