EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బిఎల్ఓ లు ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్

21.1.2024ఖమ్మం బ్యూరో,నలుబోల మధులత.(,eetaram bharatam news)

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బిఎల్ఓ లు ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ తెలిపారు. ఆదివారం కలెక్టర్, స్థానిక జిల్లా అటవీ అధికారి కార్యాలయంలోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 20, 21 తేదీలలో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమ ప్రక్రియను పరిశీలించారు. ఓటరు జాబితాలో చనిపోయిన ఓటర్లు, 100కు పైగా వయసున్న ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, చిరునామా మారిన ఓటర్ల పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఓటరు జాబితాలో ఉన్న అన్ని పేర్లను పరిశీలించాలన్నారు. ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలపై దృష్టి కేంద్రీకరించాలని, అలాగే ఓటరు జాబితాలో తొలగింపులపై సైతం దృష్టి సారించాలని అన్నారు. బిఎల్ఓ లకు ఎన్ని దరఖాస్తులు వచ్చినది, ఎన్ని పరిష్కరించినది అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు తమ పరిధిలోని అర్హత గల ప్రతిఒక్కరు ఓటు హక్కును పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.కలెక్టర్ తనిఖీ సందర్భంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహె. స్వామి, బిఎల్ఓ, తదితరులు ఉన్నారు.

Related News

Select the Topic
Scroll to Top