EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బిసి వాదాన్ని బలపరుచాలి.. బీసి లనే గెలిపించాలి : మారేప‌ల్లి ల‌క్ష్మ‌ణ్ నేత‌

హైదరాబాద్ ఏప్రిల్ 3 (ఈతరం భారతం న్యూ స్);దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంది. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను డిక్లేర్ చేసిన ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దూకాయి. తెలంగాణ‌కు వ‌స్తే లోక్ సభ ఎన్నిక‌ల‌పై ఈ సారి పార్టీల్లోనూ, ప్ర‌జ‌ల్లోనూ ఓ ఆస‌క్తి నెల‌కొంది. కార‌ణం బీసీ జ‌ప‌మే. బీజేపీ 5 స్థానాల్లో బీసీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టాయి. మ‌ల్కాజిగిరిలో ఈట‌ల రాజేంద‌ర్‌, భువ‌న‌గిరిలో బూర నర్స‌య్య గౌడ్‌, క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్‌, నిజామాబాద్ లో ధర్మ‌పురి అర‌వింద్‌, జ‌హీరాబాద్ లో బీబీ పాటిల్‌ల‌కు టికెట్లు ఇచ్చింది. ఆ త‌ర్వాతి స్థానంలో బీఆర్ఎస్ ఉంది. చేవెళ్ల‌లో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌, జ‌హీరాబాద్ లో గాలి అనిల్ కుమార్‌, భువ‌న‌గిరిలో క్యామ మ‌ల్లేష్‌, సికింద్రాబాద్ లో ప‌ద్మారావు గౌడ్‌, నిజామాబాద్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌, పెద్ద‌గా ఆశ‌లు లేని హైద‌రాబాద్ లో గ‌డ్డం శ్రీనివాస్ యాద‌వ్‌… ఇలా మొత్తం ఆరుగురు బీసీల‌ను బ‌రిలోకి దింపింది. ఈ విష‌యంలో కాంగ్రెస్ వెన‌క‌బ‌డింది. కేవ‌లం ఇద్దరు బీసీలు.. జ‌హీరాబాద్ లో సురేష్ షెట్కార్‌, సికింద్రాబాద్ లో దానం నాగేంద‌ర్‌ల‌ను నిలిపింది. క‌రీంన‌గ‌ర్ సీట్ పెండింగ్ లో ఉంది. ఇక్క‌డ తీన్మార్ మ‌ల్లన్న పేరు విన‌బ‌డుతున్నా… రెడ్డి, వెల‌మ అశావ‌హులే ముందు వ‌ర‌స‌లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార ల‌క్ష్యంతో బీసీల‌కు స‌రైన ప్రాతినిధ్యం ఇవ్వ‌లేక‌పోయామ‌ని, లోక్ స‌భ స్థానాల్లో న్యాయం చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్… మాట నిలుపుకోలేక‌పోయింది.

ఖుల్లం ఖుల్ల‌…

మొత్తానికి బీసీలు ఎక్కడెక్క‌డ పోటీ చేస్తున్నార‌న్న‌ది తేలిపోయింది. జ‌హీరాబాద్ లో ప్ర‌ధానంగా పోటీప‌డుతున్న ముగ్గురు కూడా బీసీలే కాబ‌ట్టి ఒక బీసీ ఎంపీ ఫిక్స‌యింది. ఇపుడు బీసీలుగా మ‌నం చేయాల్సింది ఏమిటి? అన్న ఆలోచ‌న రావాలి. 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎపుడూ స‌రైన ప్రాతినిధ్యం లేదు. మ‌న‌ను ప‌వ‌ర్ సెంట‌ర్ కు దూరంగా కావాల‌నే నెట్టివేశారు. బీసీ మేలుకో.. రాజ్యాన్ని ఏలుకో నినాద స్ఫూర్తితో బీసీలంతా మెల‌గాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. మ‌న స‌త్తా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో నిరూపించుకోవాల్సిన టైమ్ ఆస‌న్న‌మైంది. రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా బీసీ అభ్య‌ర్థుల‌కే ఓటు వేసి గెలిపించుకుంటే 8 మంది బీసీ ఎంపీల‌ను తెలంగాణ నుంచి పార్ల‌మెంట్ లో చూడ‌గ‌లం.

ఈ స్థానాల్లో బీసి లనే గెలిపించి బిసి వాదాన్ని బలపరుచాలి

మ‌ల్కాజిగిరిలో బీసీ ఈటల రాజేంద‌ర్‌, క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్‌, మెద‌క్ లో నీలం మ‌ధు ముదిరాజ్‌, చేవెళ్ల‌లో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌.. ఇలా ఇద్ద‌రు అప్ప‌ర్ క్యాస్ట్ వాళ్ల‌తో త‌ల‌ప‌డుతున్నారు. బీసీల‌కు ఈ స్థానాల‌లో ఓటు ఎవ‌రికి వేయాల‌న్న‌ది స్ప‌ష్టంగా క‌న‌బడుతున్న‌ది. ఇక భువ‌న‌గిరి, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ల‌లో ఇద్ద‌రు బీసీ అభ్య‌ర్థులు ఉన్నారు. ఇక్క‌డ బీసీ జెండా ఎగ‌రాలంటే గెలిచే ద‌మ్మున్న అభ్య‌ర్థివైపునే నిల‌బ‌డ‌దాం. తెలంగాణ సెంటిమెంట్‌, ఆ త‌ర్వాత కేసీఆర్ గ‌ద్దె దింపుడు అన్న మాయ పొర‌లు క‌ప్పి వెల‌మ‌లు, రెడ్లు ప‌వ‌ర్ సెంట‌ర్ ను త‌మ వ‌ద్ద భ‌ద్రంగా ఉంచుకున్నారు. కులాల వారీగా మ‌న‌ల‌ను చీల్చి తమ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. గ‌తంలోలాగా గాయి గాయి బిత్త‌ర బిత్త‌ర కాకుండా బీసీలకు ఇపుడు స్ప‌ష్ట‌మైన దారి క‌న‌బ‌డుతోంది. బీసీ ఐక్య‌త చాటుదాం.. ప‌వ‌ర్ సెంట‌ర్ కు దెగ్గ‌ర అవుదాం. రాబోయేది బీసీ రాజ్యం అని చాటుదాం.

 

Related News

Select the Topic
Scroll to Top