EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బీజేపీ మూడో జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్‌ బరిలో ఉన్నారు. మొత్తం 35 మందితో మూడో లిస్ట్‌ను బీజేపీ హై కమాండ్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎస్సీ 5, ఎస్టీ 3 మందికి చోటు కల్పించారు. ఇక ఇప్పటికే రెండు జాబితాలల్లో మొత్తం 53 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మూడో జాబితాలో అందోల్‌ నుంచి బాబుమోహన్‌, బాన్సువాడ నుంచి యెండల లక్ష్మీనారాయణ, ఉప్పల్‌ నుంచి ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌కు చోటు దక్కింది. థర్డ్ లిస్టులో కూడా బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

అభ్యర్థులు వీరే..

ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌

బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ

మంథని-చందుపట్ల అనిల్‌రెడ్డి

బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డి

అంబర్‌పేట – కృష్ణాయాదవ్

సికింద్రాబాద్ – మేకల సారంగపాణి

జూబ్లీహిల్స్ – లంకల దీపక్‌రెడ్డి

ముషీరాబాద్ – పూస రాజు

పరిగి- మారుతీ కిరణ్

రాజేంద్రనగర్- తోకల‌ శ్రీనివాసరెడ్డి

ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఎల్బీనగర్ – సామారంగారెడ్డి

సనత్‌నగర్ – మర్రి శశిధర్ రెడ్డి

 

 

Related News

Select the Topic
Scroll to Top