హైదరాబాద్ సెప్టెంబర్ 24 (ఈతరం భారతం); అన్నదాతలకు అండగా బీజేపీ రైతు హామీల సాధన దీక్ష పేరుతో 30 న ఇంద్రపార్క్ వద్ద24 గంటల దీక్ష చేయబోతున్నట్లు బిజేపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.మంగళవారం బిజెపి రాష్ట్రా కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ సెప్టెంబర్ 30 తేదీ 11 గంటల నుండి 24 గంటల పాటు దీక్ష చేయనున్న బిజేపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదుహామీలు నెరవేర్చే వరకు, అన్నదాతలకు అండగా బిజేపి పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.అన్నదాతలకు కాంగ్రెస్ పాలకులు మోసం చేస్తున్నారుఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తాను అని చెప్పి అసెంబ్లీలో కనీసం చర్చకు పెట్టలేదు.6 గ్యారెంటీలలో భాగం గా రైతులకు ఇచ్చిన హామీలు కూడా నేరవేర్చలేదు.ఏ ఊరికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లు వేసి రైతులకు రుణమాఫీ చేస్తాం అని మోసం చేశారని విమర్శించారు.,.రైతు రుణమాఫీ కోసం 40 వేల కోట్లు అవసరం అవుతాయని నిపుణులు చెప్పరని,..మీరు క్యాబినెట్ లో 30 వేల కోట్లకు ఆమోదం తెలిపారన్నారు…రైతుల కోసం మీరు ఖర్చు చేసింది కేవలం 17 వేల కోట్లే మీరు రుణమాఫీ ఐనది అని చెపుతుంటే మీ మంత్రులు కాలేదు అంటున్నారు.రైతు బోరోసాకు కు 10 వేలు కాదు 15 వేలు ఇస్తాం అన్నారు.రైతు బౌరోసా పై ఇప్పటి కి ఊసేలేదు.. మళ్ళీ రైతు బౌరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా.?కౌలు రైతులకు రైతు బౌరోసా ఇస్తామని ఇప్పుడు మోసం మీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యజమానులతో మాట్లాడుకోవాలి అంటున్నారు..రైతు కూలీలకు 12000 వేలు ఇస్తాం అన్నారు.. దాని ఊసేలేదు..వడ్లకు బోనస్ అని మేనిఫెస్టోలో పెట్టారు.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటున్నారు..కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న బోనస్ మాటలంతా అంతా బోగస్ మాటలేసన్న వడ్లు మంత్రి ఉత్తమ్ ప్రాంతాలు హుజూర్ నగర్, కోదాడ లాంటి ప్రాంతంలో పడ్డుతాయి కావచ్చు..తెలంగాణ అంతటా సన్న వడ్లను పండించరు.. ఇక్కడ పండిచేది డొద్ద్దు వడ్లే.మీది రైతు వెతిరికే ప్రభుత్వం.. మీ మెడ వచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ నెల 30 తేదీ నుండి అక్టోబర్ 1 వ తేదీ వరకు ఇంద్రపార్కు వద్ద దీక్ష చేస్తాం..ఈ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు పాల్గొంటారు..















